Posts

Padaharu Kalalaku (పదహారు కళలకు) song lyrics in Telugu

Image
  --- ఓం శ్రీ పద్మావతీ భూదేవీ సమేతస్య  శ్రీమద్ వేంకట నాయకస్య  నిత్య షోడశోపచార పూజాం కరిష్యే!  ఆవాహయామి! పదహారు కళలకు ప్రాణాలైన నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం ఓం ఆసనం సమర్పయామి! పరువాల హొయలకు పైయెదలైన నా ఊహల లలనలకు ఊరువుల ఆసనం ఓ స్నానం సమర్పయామి! చిత్తడి చిరు చెమటల చిందులు చిలికే పద్మినీ భామీనులకు పన్నీటి స్నానం ఓం గంధం సమర్పయామి! ఘలం ఘలల నడల వలన అలసిన మీ గగన జఘన సొభగులకు శీతల గంధం ఓం నైవేద్యం సమర్పయామి! రతి వేద వేద్యులైన రమణులకు  అనుభవైక వేద్యమైన నైవేద్యం ఓం తాంబూలం సమర్పయామి! మీ తహతహలకు తపనలకు తాకిళ్ళకు ఈ కొసరు కొసరు తాంబూలం ఓం సాష్టాంగ వందనం సమర్పయామి! అనంగ రంగ భంగిణులకు  సర్వాంగ చుంబనాల వందనం!  ---- Music Director : M.M.Keeravani Lyrics Writer: J k Bharavi Singer : Mano (nagoor babu)

Swathilo Muthyamantha (స్వాతిలో ముత్యమంత) song lyrics in Telugu

Image
  --- వాన వాన వచ్ఛేనంట వాగు వంక మెచ్చేనంట  తీగా డొంక కదిలేనంట తట్టా బుట్టా తడిసేనంట ఎండా వానా పెళ్ళడంగా కొండా కోనా నీళ్లాడంగా  కృష్ణా గోదారమ్మా కలిసి పరవల్లెత్తి పరిగెత్తంగా  వాన వాన వచ్ఛేనంట వాగు వంక మెచ్చేనంట.... స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందె వాన.. సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా అల్లో మల్లో...అందా....లెన్నో.. యాలో..ఓ..ఓ..యాల... స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందె వాన.. సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా... తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ.. మేనక మెరపులు.. ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా.. కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ..ఆ.. శ్రావణ సరిగమ యవ్వన ఘుమఘుమ లయనీదమ్మ.. వానా వానా వల్లప్పా.. వాటేస్తేనే తప్పా.. సిగ్గు యెగ్గూ చెల్లెప్పా.. కాదయ్యో నీ గొప్పా.. నీలో...మేఘం.. నాలో దాహం.. యాలో.. యాల... స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన.. సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా.. వానా వానా వచ్చేనంట.. వాగు వంకా మెచ్చేనంట.. తీగా డొంకా కదిలేనంట.. తట్టాబుట్టా తడిసేనంట.. ఎండా వానా పెళ్ళాడంగా.. కొండా కోనా నీళ్ళాడంగా..  కృష్ణా ...

Tango Kalalo (కలలో కలవో) song lyrics in Telugu

Image
  --- కలలో కలవో ఇలలో చెలివో ఎదలో ఎగిసే అలవో మాట వినకా... మాటు వెనుకా ఉన్నావే కంట పడవా నా జంట పడవా నా కాలి నడకా దాని వెనక నీలాగ రాక వేరేగ లేదింక ఓ నువ్వచ్చేదాక ఆగ లేక నేనే రానా ఉప్పెనలాగ ఓ చెయ్యందిస్తాగా ఓ నేవస్తున్నాగా వెళ్లిపోకే అందకుండా వెతకాలన్నా వీళ్ళేకుండా కలలో కలవో ఇలలో చెలివో ఎదలో ఎగిసే అలవో మాట వినకా... మాటు వెనుకా ఉన్నావే కంట పడవా నా జంట పడవా నీతో ఏదో చెబుతుందంటా గుండె గుబులేవిటో కొంటె కబురేవిటో కాస్త చెవినేసుకో అసలేంటో అల్లరి  అదేదో తగునో తగదో.. ఇదిలా ఇపుడే మొదలో... కలలో విడిపోవద్దే ముగిసే కథలాగా కలిసే ఉందాం కాలం కడ దాకా ---- Movie:  Cheliya Lyrics:  Sirivennela Music:  A R Rahman Singers:  Hriday Gattani, Tanvi Shah, A R Rahman Cast:  Karthi, Aditi Rao Hydari

Neevalle Neevalle (నీవల్లే నీవల్లే) song lyrics in Telugu

Image
  --- మృదు మధురంగ మృదు మధురంగ  పెదవులపైన పరిమళమల్లే రాలేవా ప్రేమా ఓహో తళ తళ లాడే తళుకుల తారై ఇక పదమంటూ ఇదే వరమంటూ రాలేవా ప్రేమా నీవల్లే నీవల్లే ఉన్నానే వ్యధలోన  నీ ముందే నీ ముందే నిలిచానే చిన్నదాన ఒక చిన్న కల ఉంది, వేదించే వయసుంది, మురిపించే వలపుంది, ప్రేమించా!! హో.. ఒకపక్క చనువుంది, నీకోసం తపనుంది, అవమానం భరియించి, యాచించా!!  మృదు మధురంగ మృదు మధురంగ  పెదవులపైన పరిమళమల్లే రాలేవా ప్రేమా ఓహో తళ తళ లాడే తళుకుల తారై ఇక పదమంటూ ఇదే వరమంటూ రాలేవా ప్రేమా  - (2) ఒకపక్క నీడల్లే, ఒకపక్క ఎండల్లే, కనిపించే వయ్యారి, నీకోసమే బ్రతికానే వలపంటే ఎదకి ఇంపై, నీ బాట పట్టానే,   కడతేర్చ వస్తావో, వ్యధపాలు చేస్తావో    ప్రాణమా ప్రాణమా నే మారిపోయానే సెల్యమై సెల్యమై సంచారి అయినానే  మృదు మధురంగ మృదు మధురంగ  పెదవులపైన పరిమళమల్లే రాలేవా ప్రేమా ఓహో తళ తళ లాడే తళుకుల తారై ఇక పదమంటూ ఇదే వరమంటూ రాలేవా ప్రేమా నీవల్లే నీవల్లే ఉన్నానే వ్యధలోన  నీ ముందే నీ ముందే నిలిచానే చిన్నదాన **English Rap Here** నీ వెంబడి వచ్చాక, నా నన్నిక పోయాక  మదినేదో పరితాపం, కుదిప...

Gunjukunna (గుంజుకున్న) song lyrics in Telugu

Image
  ---- గుంజుకున్న నిన్ను ఎదలోకే గుంజుకున్న నిన్నే ఎదలోకే ఇంకా యెన్నాళ్ళకి ఈడే ఋణం ఈ బతూకే తేనె చూపే చల్లావ్ నాపై చిందేలా తాళనంటోంది మనసే నీరు పడ్డ అద్దంలా కొత్త మణిహారం కుడి సేతి గడియారం పెద్ద పులినైనా అణిచె అధికారం నీవెల్ళినాక నీ నీడె పోనంటే పోనందే గుండె కింద నీడొచ్చి కూర్చుందే ఏఏఏ… ఇంక అది మొదలు నా మనసే తల వొంచె ఎరగదుగా గోడుగంచై నేడు మదినిప్పుతోందిగా.... గుంజుకున్న నిన్నే ఎదలోకే.. గుంజుకున్న నిన్నే ఎదలోకే ఇంకా యెన్నాళ్ళకి ఈడే ఋణం ఈ బతూకే గువ్వే ముసుగేసిందే రావాకె కునికిందే పాలేమో పెరుగులాగా ఇందాకే పడుకుందే రాచ కురుపున్నొల్లే నిదరొయె వేళల్లోన ఆశ కురుపొచ్చి అదే అర నిమిషం నిదరోదే గుంజుకున్న నిన్ను ఎదలోకే ఇంకా యెన్నాళ్ళకి ఈడే ఋణం ఈ బతూకే *** రె రె రరరననన నా నన నన రరరరనన ర రె రే ననననా *** ఎంగిలి పడనేలేదే అంగిలి తడవనే లేదే ఆరేడు నాళ్లయ్యి ఆకలి ఊసే లేదే ఏఏఏ… పేద ఎదనే దాటి ఏది పలకదు పెదవే రబ్బరు గాజులకేమో సడి చేసే నోరెదే హో.. గుంజుకున్న నిన్ను ఎదలోకే ఇంకా యెన్నాళ్ళకి ఈడే ఋణం ఈ బతూకే  తేనె చూపే చల్లావ్ నాపై చిందేలా తాళనంటోంద...

Jummane Tummeda Veta (ఝుమ్మనె తుమ్మెద వేట) song lyrics in Telugu

Image
  ---- ఝుమ్మనె తుమ్మెద వేట గుమ్మనె వలపుల తోట అదేమొ మామ అదేలె ప్రేమ జగదేక వీర శూర తరించైనా.. సరసాల సాగరాలె మధించైనా.. ఝుమ్మనె తుమ్మెద వేట గుమ్మనె వలపుల తోట మిడిసి మిడిసి పడు ఉడుకు వయసు కథ వినలేదా..ఆ.అ.. ఎగసి ఎగసి పడు తనువు తపన నువు కనలేదా.ఆ.అ పెదవులతొ.... కలవమని అందుకే నే ముందుకొచ్చా అందినంతా, ఆరగిస్తా రా రా రా రా రాజచంద్రమ. ---- ఝుమ్మనె తుమ్మెద వేట గుమ్మనె వలపుల తోట అదేమొ _భామ అదేలె ప్రేమ సరసాల సాగరాలె మధించైనా జగదేక వీర శూర తరించైనా **** ని స రి స - ని స రి స ని స రి స - ని స రి స ని ప మ ప - ని స రి స ని స రి స - ని స రి స ని స రి స - ని స రి స ని ప మ ప - ని స రి స **** సెగలు రగిలె వొడి బిగిసె రవిక ముడి అదియేమో .ఓ.ఒ.. చిలిపి వలపు జడి తగిలి రగిలె వొడి జవరాలా.ఓ.ఒ.. వడి వడిగా .. ముడిపడని చెప్పలేకే,  చేరుకున్నా ఓపలేకే, వేడుకున్నా రావె రావె రాగమంజరి ఝుమ్మనె తుమ్మెద వేట గుమ్మనె వలపుల తోట అదేమొ మామా.. అదేలె ప్రేమ_ శృంగార సార్వభౌమ తరించైనా సరసాల దీవి చేరి_ సుఖించైనా.. --- Music: Raj Koti Lyrics: Bhuvana Chandra Singers: SP Balasubramanyam, SK Chithra

Laayi Laayi ( లాయి లాయి) song lyrics in Telugu

Image
  ----  లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా  మాయలేని మోయలేని ప్రాయమమ్మా  లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా  గాలి రంగులోన ఉన్న గాయమమ్మా  లేత లేత చేతిలో చేతులేసి చేరుకో  ఊసులెన్నో పంచుకున్న వేళలో  మనదే సరదా సరదా .. లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా మాయలేని మోయలేని ప్రాయమమ్మా లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా గాలి రంగులోన ఉన్న హృదయమమ్మ ఇంతలో ఇలా ఎదిగిన ఆ తలపులో ఎవరికై ఈ పిలుపులో  వింత వింతగా తిరిగిన ఈ మలుపులో తన జతేను కలుపుకో  ఇదెంత చెప్పలేని ఈ భావనే పేరునుందో  తెలియదు దానికైనా ఈ వేళ  జవాబు చెప్పలేని ఈ ప్రశ్నలింకేన్ని ఎన్నో  అవన్నీ బయటపడవు ఇవ్వాళ  లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి  స్పర్శలాగా పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా  లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా మాయలేని మోయలేని ప్రాయమమ్మా లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా గాలి రంగులోన ఉన్న గాయమమ్మా మాటిమాటికీ మొదలయే అలికిడి మరుక్షణం ఓ అలజడి  ఆకతాయిగా తడిమితే తడబడి తరగదే ఈ సందడి  చలాకి కంటిపూల తావీదు తాకిందిలాగ  గులాబీ లాంటి గుండె మోసేనా  ఇలా...