Swathilo Muthyamantha (స్వాతిలో ముత్యమంత) song lyrics in Telugu

 


---

వాన వాన వచ్ఛేనంట వాగు వంక మెచ్చేనంట 
తీగా డొంక కదిలేనంట తట్టా బుట్టా తడిసేనంట
ఎండా వానా పెళ్ళడంగా కొండా కోనా నీళ్లాడంగా 
కృష్ణా గోదారమ్మా కలిసి పరవల్లెత్తి పరిగెత్తంగా 

వాన వాన వచ్ఛేనంట వాగు వంక మెచ్చేనంట....

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందె వాన..
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా
అల్లో మల్లో...అందా....లెన్నో.. యాలో..ఓ..ఓ..యాల...

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందె వాన..
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా...

తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ..
మేనక మెరపులు.. ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా..
కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ..ఆ..
శ్రావణ సరిగమ యవ్వన ఘుమఘుమ లయనీదమ్మ..

వానా వానా వల్లప్పా.. వాటేస్తేనే తప్పా..
సిగ్గు యెగ్గూ చెల్లెప్పా.. కాదయ్యో నీ గొప్పా..

నీలో...మేఘం.. నాలో దాహం.. యాలో.. యాల...

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా..

వానా వానా వచ్చేనంట.. వాగు వంకా మెచ్చేనంట..
తీగా డొంకా కదిలేనంట.. తట్టాబుట్టా తడిసేనంట..
ఎండా వానా పెళ్ళాడంగా.. కొండా కోనా నీళ్ళాడంగా..
 కృష్ణా గోదారమ్మ కలిసి.. పరవళ్ళెత్తి పరిగెత్తంగా

తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన..
జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన..
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన

వానల్లోన సంపెంగ.. ఒళ్ళంతా ఓ బెంగా..
గాలి వాన గుళ్ళోనా.. ముద్దే లే  జేగంట..

నాలో.... రూపం.. నీలో తాపం... యాలో....యాల

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా
అల్లో మల్లో...
అందా....లెన్నో..

యాలో..ఓ..ఓ..యాల...

----

Lyrics: Veturi Sundararama Murthy
Singers: S.P. Balasubramanyam, K.S. Chithra
Music: Raj-Koti







Comments

Popular posts from this blog

Pachani Thota (పచ్చని తోట) song lyrics in Telugu

Preminche Premava (ప్రేమించే ప్రేమవా) song lyrics in Telugu

Chinnaga Chinnaga (చిన్నగ చిన్నగ) song lyrics in Telugu