Neevalle Neevalle (నీవల్లే నీవల్లే) song lyrics in Telugu
---
మృదు మధురంగ మృదు మధురంగ
పెదవులపైన పరిమళమల్లే రాలేవా ప్రేమా
ఓహో తళ తళ లాడే తళుకుల తారై
ఇక పదమంటూ ఇదే వరమంటూ రాలేవా ప్రేమా
నీవల్లే నీవల్లే ఉన్నానే వ్యధలోన
నీ ముందే నీ ముందే నిలిచానే చిన్నదాన
ఒక చిన్న కల ఉంది, వేదించే వయసుంది, మురిపించే వలపుంది, ప్రేమించా!!
హో.. ఒకపక్క చనువుంది, నీకోసం తపనుంది, అవమానం భరియించి, యాచించా!!
మృదు మధురంగ మృదు మధురంగ
పెదవులపైన పరిమళమల్లే రాలేవా ప్రేమా
ఓహో తళ తళ లాడే తళుకుల తారై
ఇక పదమంటూ ఇదే వరమంటూ రాలేవా ప్రేమా - (2)
ఒకపక్క నీడల్లే, ఒకపక్క ఎండల్లే, కనిపించే వయ్యారి, నీకోసమే బ్రతికానే
వలపంటే ఎదకి ఇంపై, నీ బాట పట్టానే, కడతేర్చ వస్తావో, వ్యధపాలు చేస్తావో
ప్రాణమా ప్రాణమా నే మారిపోయానే
సెల్యమై సెల్యమై సంచారి అయినానే
మృదు మధురంగ మృదు మధురంగ
పెదవులపైన పరిమళమల్లే రాలేవా ప్రేమా
ఓహో తళ తళ లాడే తళుకుల తారై
ఇక పదమంటూ ఇదే వరమంటూ రాలేవా ప్రేమా
నీవల్లే నీవల్లే ఉన్నానే వ్యధలోన
నీ ముందే నీ ముందే నిలిచానే చిన్నదాన
**English Rap Here**
నీ వెంబడి వచ్చాక, నా నన్నిక పోయాక
మదినేదో పరితాపం, కుదిపేనే తొలిమోహం
తప్పేదే తెలియదులే, ఒప్పేదో తెలియదులే
ఏ పక్కనున్నానో అదికూడ తెలియదులే,
అనుక్షణం అనుక్షణం రగిలిందే ఆ గాయం
ఏ క్షణం పోవునో యదలోని ఈ మౌనం
ప బ బ బ బ బ, ప బ బ బ బ బ,
ప బ బ పాబా, ప బ బ పాబా
నీవల్లే నీవల్లే ఉన్నానే చెలికాడా, నీముందే నీముందే మెల్లంగా నిలిచాగా
ఒక చిన్న కల ఉంది, వేదించే వయసుంది, మురిపించే వలపుంది, ప్రేమించా!
ఒకపక్క చనువుంది, ఉబికొచ్చే తపనుంది, అభిమానం పదమంటే యాచించా!!
----
Music: Harris Jayaraj
Lyricist: Bhuvana Chandra
Singers : Harini, Karthik
Comments
Post a Comment