Gunjukunna (గుంజుకున్న) song lyrics in Telugu
----
గుంజుకున్న నిన్ను ఎదలోకే
గుంజుకున్న నిన్నే ఎదలోకే
ఇంకా యెన్నాళ్ళకి ఈడే ఋణం ఈ బతూకే
తేనె చూపే చల్లావ్ నాపై చిందేలా
తాళనంటోంది మనసే నీరు పడ్డ అద్దంలా
కొత్త మణిహారం కుడి సేతి గడియారం
పెద్ద పులినైనా అణిచె అధికారం
నీవెల్ళినాక నీ నీడె పోనంటే పోనందే
గుండె కింద నీడొచ్చి కూర్చుందే ఏఏఏ…
ఇంక అది మొదలు నా మనసే తల వొంచె ఎరగదుగా
గోడుగంచై నేడు మదినిప్పుతోందిగా....
గుంజుకున్న నిన్నే ఎదలోకే..
గుంజుకున్న నిన్నే ఎదలోకే
ఇంకా యెన్నాళ్ళకి ఈడే ఋణం ఈ బతూకే
గువ్వే ముసుగేసిందే రావాకె కునికిందే
పాలేమో పెరుగులాగా ఇందాకే పడుకుందే
రాచ కురుపున్నొల్లే నిదరొయె వేళల్లోన
ఆశ కురుపొచ్చి అదే అర నిమిషం నిదరోదే
గుంజుకున్న నిన్ను ఎదలోకే
ఇంకా యెన్నాళ్ళకి ఈడే ఋణం ఈ బతూకే
***
రె రె రరరననన నా నన నన రరరరనన
ర రె రే ననననా
***
ఎంగిలి పడనేలేదే అంగిలి తడవనే లేదే
ఆరేడు నాళ్లయ్యి ఆకలి ఊసే లేదే ఏఏఏ…
పేద ఎదనే దాటి ఏది పలకదు పెదవే
రబ్బరు గాజులకేమో సడి చేసే నోరెదే
హో.. గుంజుకున్న నిన్ను ఎదలోకే
ఇంకా యెన్నాళ్ళకి ఈడే ఋణం ఈ బతూకే
తేనె చూపే చల్లావ్ నాపై చిందేలా
తాళనంటోంది మనసే నీరు పడ్డ అద్దం లా
కొత్త మణిహారం కుడి సేతి గడియారం
పెద్ద పులినైనా అణిచె అధికారం
నీవెల్ళినాక నీ నీడె పోనంటే పోనందే
గుండె కింద నీడొచ్చి కూర్చుందే ఏఏఏ…
ఇంక అది మొదలు నా మనసే తల వొంచె ఎరగదుగా
గోడుగంచై నేడు మదినిప్పుతోందిగా
గుంజుకున్న నిన్నే ఎదలోకే
గుంజుకున్న నిన్నే ఎదలోకే
ఇంకా యెన్నాళ్ళకి ఈడే ఋణం ఈ బతూకే
---
Music: A.R Rahman
Lyrics: Vanamali
Singer: Shakthisree Gopalan
Comments
Post a Comment