Samayama (సమయమా) song lyrics in Telugu

 

----

సమయమా.. అదేమిటంత తొందరేంటి ఆగుమా...

సమయమా.. మరింత హాయి పోగు చేయనీయుమా...


చేతిలోన చేతులేసుకున్న చోటు లోన

చూపు తోటి చూపులల్లుకున్న దారిలోన

శ్వాసలోకి శ్వాస చేరుకున్న మాయలోన

ఆనంద వర్ణాల సరిగమా...


సమయమా.. సమయమా.. సమయమా... 

కదలకే...  క్షణమా... 

జతపడే... ఎదలలో... మధురిమా... 

వదులుకోకే.. వినుమా... 


ఆ నింగి జాబిల్లిపై... ఏ నీటి జాడున్నదో

నే చూడలేనె అపుడే... 

ఈ నేల జాబిల్లిపై...  సంతోష భాష్పాలని

చూస్తూ ఉన్నానె...  ఇపుడే... 


తనే నా సగంగా... 

తనే నా జగంగా... 

స్వరాల ఊయలూగుతుండగా...


ఏడేడు లోకాలు...  

ఆరారు కాలాలు...  

ఆ తారా తీరాలు... 

ఆనంద ద్వారాలు... 

తీసి మురిసే వేళా..

తీపై కురిసే వేళా..

ఈ స్వప్న సత్యాన్ని.. దాటేసి పోనీకు


సమయమా.. సమయమా.. సమయమా... 

కదలకే...  క్షణమా...

జతపడే... ఎదలలో... మధురిమా... 

వదులుకోకే.. వినుమా...

---


Music: Prashanth R. Vihari

Lyrics: Ananth Sriram

Singer: Yazin Nizar, Harini

Comments

Popular posts from this blog

Pachani Thota (పచ్చని తోట) song lyrics in Telugu

Preminche Premava (ప్రేమించే ప్రేమవా) song lyrics in Telugu

Chinnaga Chinnaga (చిన్నగ చిన్నగ) song lyrics in Telugu