Moosina Muthyalake (మూసిన ముత్యాలకే) song lyrics in Telugu
----
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే.. అలవోకలు
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికేలే..అలవోకలు
కందులేని మోమునకేలే..కస్తూరి
చిందుని కొప్పునకేలే..చేమంతులు
మందయానమునకేలే హా.. మట్టెల మోతలు
మందయానమునకేలే మట్టెల మోతలు
గంధమేలే..పైకమ్మని నీమేనికి
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు
ముద్దుముద్దు మాటలకేలే..ముదములు
నీ అద్దపు చెక్కిలికేలే..అరవిరి
ఒద్దిక కూటమికేలే..ఏలే..ఏలే..ఏలే లే..
ఒద్దిక కూటమికేలే వూర్పులు
నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు
---
Lyrics: Annamacharya
Music: M.M Keeravani
Singer: S.P. Balasubramanyam
Comments
Post a Comment