Sipaayi Sipaayi (సిపాయి, సిపాయి) song lyrics in Telugu

 

----


సిపాయి, సిపాయి, సిపాయి, సిపాయి

నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో

ఈ వాలు కనులనడుగు అడుగు చెబుతాయి.... సిపాయి ఓ సిపాయి

హసీనా హసీనా

నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో

ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా.... హసీనా ఓ హసీనా


జడలోని మల్లెలు జారితే

నీ ఒడిలో ఉన్నాననుకున్నా

చిరుగాలిలో కురులూగితే

చిరుగాలిలో కురులూగితే

నీ చేయి సోకెనని అనుకున్నా


ఆ....మల్లెలలో కదలాడినవి నా కలవరింపులే

ఆ గాలిలో చెలరేగినవి

ఆ గాలిలో చెలరేగినవి

నా నిట్టూరుపులే

హసీనా ఓ హసీనా

నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో

ఈ వాలు కనులనడుగు అడుగు చెబుతాయి.... సిపాయి ఓ సిపాయి


తడి ఇసుకన గీసిన గీతలు అల తాకితే మాసి పోతాయి

ఎదలోన వ్రాసిన లేఖలు

ఎదలోన వ్రాసిన లేఖలు

బ్రతుకంతా ఉండిపోతాయి

ఆ.... లేఖలలో ఉదయించినవి నా భాగ్యరేఖలే

మన ఊపిరిలో పులకించినవి

మన ఊపిరిలో పులకించినవి

వలపు వాకలే

సిపాయి, సిపాయి


నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో

ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా.... హసీనా ఓ హసీనా

సిపాయి... ఓ... సిపాయి... హసీనా... ఓ... హసీనా


---


Music Director : C.Ramachandra

Lyrics Writer: C.Narayana Reddy

Singers: Mohammad Rafi,  P.Suseela


Comments

Popular posts from this blog

Pachani Thota (పచ్చని తోట) song lyrics in Telugu

Preminche Premava (ప్రేమించే ప్రేమవా) song lyrics in Telugu

Chinnaga Chinnaga (చిన్నగ చిన్నగ) song lyrics in Telugu