Enno ratrulu vastai gani(ఎన్నో రాత్రులొస్తాయి గానీ) song lyrics in telugu


   ----

ఎన్నో రాత్రులొస్తాయి గానీ

రాదీ వెన్నెలమ్మ

ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ

అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు...


ఎన్నో రాత్రులొస్తాయి గానీ

రాదీ వెన్నెలమ్మ

ఎన్నో ముద్దిలిస్తారు గానీ

లేదీ వేడి చెమ్మ


ఎన్ని మోహాలు మోసీ

ఎదలు దాహాలు దాచా

పెదవి కొరికే పెదవి కొరకే... ఓహోహో


నేనెన్ని కాలాలు వేచా.... ఎన్ని గాలాలు వేశా...

మనసు అడిగే మరులు సుడికే... ఓహోహో


మంచం ఒకరితో అలిగిన..

మౌనం వలపులే చదివినా...


ప్రాయం సొగసులే వెతికినా.. 

సాయం వయసునే అడిగినా....


ఎన్నో రాత్రులొస్తాయి గానీ

రాదీ వెన్నెలమ్మ

ఎన్నో ముద్దిలిస్తారు గానీ

లేదీ వేడి చెమ్మ


గట్టి ఒత్తిళ్ల కోసం గాలి కౌగిళ్లు తెచ్చా

తొడిమ తెరిచే తొనల రుచికే... ఓహోహో


నీ గోటిగిచ్చుళ్ల కోసం మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా

చిలిపి పనుల చెలిమి జతకే... ఓహోహో

అంతే ఎరుగనీ అమరిక

ఎంతో మధురమే బడలిక

ఛీ పో బిడియమా సెలవిక

నాకీ పరువమే పరువిక


ఎన్నో రాత్రులొస్తాయి గానీ

రాదీ వెన్నెలమ్మ

ఎన్నో ముద్దిలిస్తారు గానీ

లేదీ వేడి చెమ్మ


అన్నాడే చిన్నోడు.. అన్నిట్లో ఉన్నోడు...


ఎన్నో రాత్రులొస్తాయి గానీ

రాదీ వెన్నెలమ్మ

ఎన్నో ముద్దిలిస్తారు గానీ

లేదీ వేడి చెమ్మ..


---

రచన : వేటూరి 

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలు, చిత్ర


Comments

Popular posts from this blog

Pachani Thota (పచ్చని తోట) song lyrics in Telugu

Preminche Premava (ప్రేమించే ప్రేమవా) song lyrics in Telugu

Chinnaga Chinnaga (చిన్నగ చిన్నగ) song lyrics in Telugu