Ee reyi teeyanidi (ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది) song lyrics in telugu

 



----

ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది 

ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది 

ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి 

ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి 


ఓ వరములా దొరికెనీ పరిచయం 

నా మనసులో కురిసెనే అమృతం 

నా నిలువునా అలలయే పరవశం 

నీ చెలిమికే చేయని అంకితం 

కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం 


ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి 

ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి 


నీ ఊపిరే వెచ్చగా తగలని 

నా నుదుటిపై తిలకమై వెలగని 

నా చూపులే చల్లగా తాకని 

నీ పెదవిపై నవ్వుగా నిలవని 

ఆశలకే అయువుగా మారెను నీ స్నేహం 


ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది 

ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది 

ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది..


---

Music:Ramana Gogula
Lyrics-Sirivennela
Singers :Hariharan, Nandita

Comments

Popular posts from this blog

Pachani Thota (పచ్చని తోట) song lyrics in Telugu

Preminche Premava (ప్రేమించే ప్రేమవా) song lyrics in Telugu

Chinnaga Chinnaga (చిన్నగ చిన్నగ) song lyrics in Telugu