Allei Allei (అల్లేయ్ అల్లేయ్) Song Lyrics in Telugu

 


---

ఆశ ఆగనందే నిన్ను చూడకుంటే
శ్వాస ఆడనందే అంత దూరముంటే
నన్నే మల్లె తీగలాగ నువ్వు అల్లకుంటే
నిలువెత్తు ప్రాణం నిలవదటే
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
నా చిట్టి చిలక జట్టై అల్లేయి
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
ఏమంత అలక చాల్లే అల్లేయ్

నిను వెతికే నా కేకలకు మౌనమే బదులైందే
మౌనములో నీ మాటిదని మనసే పోల్చుకుందే
లాలన చేసే వేలే లేని పంతం వదిలి పలకవటే
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
పుప్పొడి తునక గాలై అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
పన్నీటి చినుకా జల్లై అల్లేయ్
హో...

ముడిపడి పోయామొక్కటిగా విడివడి పోలేక
కాదనుకున్న తప్పదుగా వాదన దేనికికా....
పదునుగ నాటే మన్మధ బాణం
నేరం ఏమి కాదు కదే
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
నా జత గువ్వా జట్టై అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
నా చిరునవ్వా జల్లై అల్లేయ్

----

Movie:  Cheliya
Lyrics:  Sirivennela
Music:  A R Rahman
Singers:  Chinmayi, Abhay Jodhpurkar, A R Rahman
Cast:  Karthee, Aditi Rao Hydari


Comments

Popular posts from this blog

Pachani Thota (పచ్చని తోట) song lyrics in Telugu

Preminche Premava (ప్రేమించే ప్రేమవా) song lyrics in Telugu

Chinnaga Chinnaga (చిన్నగ చిన్నగ) song lyrics in Telugu